Fri Dec 05 2025 09:26:47 GMT+0000 (Coordinated Universal Time)
14000 మందికి చీరలు ఇచ్చిన ఉపముఖ్యమంత్రి
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ మహిళలకు శ్రావణమాస కానుకగా 14వేల చీరలు పంపించారు.

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ మహిళలకు శ్రావణమాస కానుకగా 14వేల చీరలు పంపించారు. ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ, జనసేన పార్టీ నాయకులు కలిసి మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలను శుక్రవారం నాడు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పాదగయ క్షేత్రంలో ఐదు బృందాలుగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి వేలసంఖ్యలో మహిళలు ఆలయానికి పోటెత్తారు. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story

