Wed Jan 28 2026 23:19:57 GMT+0000 (Coordinated Universal Time)
చింతమనేనిపై ఇన్ని కేసులా?
దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పై అత్యధికంగా కేసులు నమోదయి ఉన్నాయి

దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పై అత్యధికంగా కేసులు నమోదయి ఉన్నాయి. ఆయన నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లొ ీ ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థి పైన లేనన్ని కేసులు చింతమనేని ప్రభాకర్ పై నమోదయ్యాయి. గతంలో ముప్ఫయి కేసులు నమోదయయితే ఈ ఐదేళ్లలో 93 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.
రౌడీషీట్ కూడా...
93 కేసులతో పాటు రౌడీ షీటర్ కూడా అదనం. ఇక చింతమనేని స్థిర చరాస్తులన్నీ కలిపి సుమారు 50 కోట్ల రూపాయలున్నట్లు అఫడవిట్ లో పేర్కొన్నారు. తహశీల్దార్ వనజాక్షి పై దాడిచేసిన కేసుతో పాటు తనపై నమోదైన కేసుల వివరాలను అఫిడవిట్లో చింతమనేని చూపించారు. మాజీమంత్రి వట్టి వసంత్ కుమార్ పై దాడిచేసిన కేసులో చింతమనేని ప్రభాకర్ కు రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
Next Story

