Wed Jan 21 2026 12:44:25 GMT+0000 (Coordinated Universal Time)
ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలు
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో మళ్లీ కూల్చివేతల కార్యక్రమం మొదలయింది. అధికారులు గ్రామస్థులకు నోటీసులు జారీ చేశారు

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో మళ్లీ కూల్చివేతల కార్యక్రమం మొదలయింది. వారం రోజుల క్రితం అధికారులు గ్రామస్థులకు నోటీసులు జారీ చేశారు. ఈరోజు భారీ ప్రొక్రెయిన్లతో అధికారులు ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. రహదారి విస్తరణ కోసమే ఇప్పటం గ్రామంలో ఇళ్లను కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గతంలోనూ...
గతంలోనూ ఇప్పటంలో ఇళ్లను కూల్చివేత ఘటన వివాదంగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటంలో కూల్చివేతలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సభలకు స్థలం ఇచ్చారన్న కారణంగానే ఇప్పటం గ్రామంలో కూల్చివేతలు ప్రారంభించారని జనసేన ఆరోపించింది. అయితే మరోసారి ఇప్పటంలో కూల్చివేతలపై పవన్ ఏ రకంగా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story

