Wed Jan 21 2026 12:44:46 GMT+0000 (Coordinated Universal Time)
గీతం కళాశాలలో ఆక్రమణల తొలగింపు
విశాఖలోని గీతం మెడికల్ కళాశాల వద్ద కూల్చివేతలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని చెబుతున్నారు

విశాఖలోని గీతం మెడికల్ కళాశాల వద్ద కూల్చివేతలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేత పనులను ప్రారంభించారు. తెల్లవారు జాము నుంచే కూల్చివేతలను మొదలు పెట్టారు. ప్రస్తుతం ప్రహరీ గోడలను తొలగించే పనిని ప్రారంభించారు.
గతంలో కూడా...
గతంలో కూడా గీతం కళాశాలలో ఆక్రమణలను కూల్చివేసే ప్రయత్నం జరిగింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించి అప్పడు స్టే తెచ్చుకున్నారు. దాదాపు 45 ఎకరాల మేరకు భూమి ఆక్రమణలు జరిగాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారరు. ఆర్డీవో ఆధ్వర్యంలో నిర్మాణాలను తొలగిస్తున్నారు. దీనిపై కళాశాల యాజమాన్యం అభ్యంతరం చెబుతోంది.
Next Story

