Fri Mar 20 2026 09:46:57 GMT+0530 (India Standard Time)
కీసర గ్రామంలో మచ్చల జింక
కీసర టోల్ ప్లాజా వద్ద మచ్చల జింక కనిపించింది

కీసర టోల్ ప్లాజా వద్ద మచ్చల జింక కనిపించింది. కుక్కలు దాడి చేయటంతో ఒంటి పై గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ గ్రామస్తులు చేతికి మచ్చల జింక చిక్కింది. మచ్చల జింకను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇలాంటి జింక తమ గ్రామ పరిసర ప్రాంతాల్లోకి రావడంతో అందరూ గుమిగూడారు.
గాయపడిన జింకను...
మచ్చల జింక గాయపడిందని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు మచ్చల జింక గ్రామంలోకి రావటం ఇది రెండోసారిగా స్థానికులు తెలిపారు. మచ్చల జింకను చూసేందుకు పెద్దయెత్తున ప్రజలు తరలివచ్చారు. జింకను అటవీ శాఖ అధికారులు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు.
Next Story

