Thu Mar 26 2026 14:05:43 GMT+0530 (India Standard Time)
Bus Accident : మార్కాపురం బస్సు ప్రమాద మృతులు వీరే
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో కొందరు మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో కొందరు మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. జగిత్యాల రాయికల్ మండలం రామారావు పల్లెకు చెందిన ఉప్పు రమ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆమె వయసు యాభై ఐదేళ్లు. అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దాసరపల్లికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు కూడా మరణించారు.
గుర్తు పట్టలేని విధంగా...
ఉప్పు కిరణ్ కు, తుపాకుల రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే మార్కాపురం బస్సు ప్రమాదంలో పదమూడు మంది మరణించగా అందులో ఇద్దరిని మాత్రమే గుర్తించారు. మిగిలిన మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. దీంతో డీఎన్ఏ టెస్ట్ ల ఆధారంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
Next Story

