Wed Feb 08 2023 07:52:04 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్బీకే సారీ చెబుతారా?
నందమూరి బాలకృష్ణకు కాపునాడు పెట్టిన డెడ్ లైన్ నేటి సాయంత్రంతో ముగియనుంది

నందమూరి బాలకృష్ణకు కాపునాడు పెట్టిన డెడ్ లైన్ నేటి సాయంత్రంతో ముగియనుంది. ఎస్వీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పకుంటే లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈరోజు సాయంత్రంలోపు బాలయ్య బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాపునాడు నిన్న అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నందమూరి బాలకృష్ణ నేటి వరకూ క్షమాపణలు చెప్పలేదు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ ఏఎన్నార్, ఎస్వీ రంగారావులపై చేసిన వ్యాఖ్యలపై కాపునాడు, ఇటు ఏఎన్నార్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
ఎల్లుండి నుంచే పాదయాత్ర...
మరోవైపు ఎల్లుండి నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో బాలయ్య కాపులకు క్షమాపణలు చెబుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అక్కినేని పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు నరక్తి సెంటర్ లో ఏఎన్నార్ అభిమానులు ఆందోళనకు దిగారు. బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కినేని కుటుంబానికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలంటే వారు డిమాండ్ చేశారు.
Next Story