Sun Mar 15 2026 08:55:02 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటివద్ద కుమార్తెల ఆందోళన
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట ఆయన కుమార్తెలు ఆందోళనకు దిగారు.

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట ఆయన కుమార్తెలు ఆందోళనకు దిగారు. టెక్కలిలోని అక్కవరం లోని ఆయన ఇంటివద్దకు ఇద్దరు కుమార్తెలు చేరుకుని తమను లోపలికి అనుమతించాలని కోరారు. దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు హైందవి, నవీనలు తన తండ్రితో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ అక్కడే ఆందోళనకు దిగారు.
ఎన్నికలకు ముందే...
ఎన్నికలకు ముందే దువ్వాడ శ్రీనివాస్ కు, ఆయన భార్య వాణికి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఒకదశలో దువ్వాడ శ్రీనివాస్ భార్యకు టిక్కెట్ ఇవ్వాలనుకున్నా చివరి క్షణంలో జగన్ ఆ నిర్ణయం మార్చుకుని తిరిగి టిక్కెట్ ను దువ్వాడ శ్రీనివాస్ కే ఇచ్చారు. ఆయన వేరే ఇంట్లో ఉంటున్నారు. తమ తండ్రిని కలిసేందుకు వచ్చినా కలవనీయలేదని, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని దువ్వాడ కుమార్తెలు ఆరోపిస్తున్నారు.
Next Story

