Fri Dec 05 2025 14:03:38 GMT+0000 (Coordinated Universal Time)
Daggubait Prasad : ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్లుందిగా?
దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తాను పార్టీ అధినాయకత్వం ప్రాపకం సంపాదించాలన్న ప్రయత్నంలో అసలుకే ఎసరు వచ్చేలా ఉంది.

దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తాను పార్టీ అధినాయకత్వం ప్రాపకం సంపాదించాలన్న ప్రయత్నంలో అసలుకే ఎసరు వచ్చేలా ఉంది. దగ్గుబాటి ప్రసాద్ పార్టీ హైకమాండ్ కు మరింత దగ్గరయి అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీలో ఉన్న తన ప్రత్యర్ధులకు చెక్ పెట్టాలనుకున్నారు. అయితే తాను లోకేశ్ నుంచి శభాష్ అనిపించుకోవాలనుకున్నారు. అందుకు జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తే లోకేశ్ కు దగ్గరవుతానని భావించాడు. కానీ అది భ్రమేనని తేలింది. ఎందుకంటే నందమూరి, నారా కుటుంబాలు ఒక్కటేనన్న విషయం బహుశా దగ్గుబాటి ప్రసాద్ గుర్తించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అనూహ్యంగా టిక్కెట్ లభించడంతో...
గత ఎన్నికల్లోనే అనూహ్యంగా దగ్గుబాటి ప్రసాద్ కు టిక్కెట్ లభించింది. రాప్తాడుకు చెందిన దగ్గుబాటి ప్రసాద్ కు అనంతపురం అర్బన్ టీడీపీ టిక్కెట్ లభించిందిఎంపీపీగా ఉన్న ఆయనకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సహకారంతో టిక్కెట్ దక్కించుకున్నారని అంటారు. కానీ ఎమ్మెల్యే అయిన నాటి నుంచి నియోజకవర్గంలోని సొంత పార్టీలో మిత్రులకన్నా శ్రతువులు ఎక్కువయ్యారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో విభేదాలు మరింత ముదిరి వీధినపడ్డాయి. దీంతో పాటు అనేక విషయాల్లో దగ్గుబాటి ప్రసాద్ పై వస్తున్న ఆరోపణలతో అధినాయకత్వం కూడా అప్రమత్తమయింది. ఇప్పటికే అనేక సార్లు పిలిచి హెచ్చరికలు జారీ చేసింది. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో...
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా దీనికి తోడయింది. వార్ 2 సినిమా విడుదలయిన సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తూ టీడీపీ యువత కు చెందిన నేత ధనుంజయ్ నాయుడితో మాట్లాడిన తీరును కొందరు వైరల్ చేశారు. ఇది ప్రత్యర్థుల పనేనంటూ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చెబుతున్నారు. మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. బహిరంగంగా దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణ చెప్పేంత వరకూ వదలబోమని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈరోజు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి దగ్గుబాటి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, లోకేశ్ లుకూడా ిటువంటి వ్యాఖ్యలకు తాము మద్దతివ్వబోమని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దీంతో తాను అనుకున్నది ఒకటి కాగా అది బూమ్ రాంగ్ గా మారిపోవడంతో దగ్గుబాటి ప్రసాద్ కు రాజకీయంగా కష్టాలు తప్పడం లేదు.
Next Story

