Cyclone Montha : తుపాను సమయంలో ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే సులువుగా తుపాను ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ను తాకుతున్న మొంథా తుఫాను గాలి వేగం గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అయితే మేఘ విస్ఫోటనం .. మెరుపు వరదలు సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా , తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాలు మెరుపు వరదలు ఎదుర్కోనున్నాయి. అయితే మెరుపు వరదలు సంభవించినప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులు సూచిస్తున్నారు. తక్కువ సమయం లో అతి భారీ వర్షం పడటం కారణంగా రోడ్లు డ్రైనేజీ కాలువలు నిండిపోయి అవి జనావాసాల మీదకు వచ్చే అవకాశముందని, అందుకోసం ముందు జాగ్రత్త చర్యలతో పాటు ప్రభుత్వం సూచించనట్లుగా పునరావాస కేంద్రాలకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.

