Sat Dec 13 2025 22:33:11 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మొంథా తుపాను పై జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మొంథా తుపాను పై జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. మొంథా తుపాను దెబ్బకు ఏపీ భారీగా నష్టపోయిందని తెలిపింది. వ్యవసాయ రంగం బాగా దెబ్బతినిందని, తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. లబ్దిదారులకు తక్షణం సాయం అందించేందుకు, వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు నిధులు విడుదల చేయాలని కోరింది. రెండు లక్షల మంది రైతులు నష్టపోయారని తెలిపింది.
పదిహేడు రంగాలకు...
పదిహేడు రంగాలకు నష్టం వాటిల్లిందని, 5,244 కోట్ల సాయం చేయాలని కోరింది. 3.75 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని, ఆక్వా రంగానికి భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. తక్షణ సాయం కింద రూ.514 కోట్లు ఇవ్వాలని కోరింది. 1,434 గ్రామాలు, 58 పట్టణాలపై తుపాను ప్రభావం చూపిందని, 187 మండలాల్లో భారీ, అతిభారీ, అత్యంత భారీ వర్షాలు పడ్డాయని, 4,794 కి.మీ. పొడవైన రహదారులు గుంతలమయంగా మారాయిని, మరమ్మతులు, పునరుద్ధరణకు రూ.2,744 కోట్లు అవసరం అవుతుందని తెలిపింది. 18.20 లక్షల మందిపై మొంథా ప్రభావం చూపిందని నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
Next Story

