Sat Dec 13 2025 22:33:22 GMT+0000 (Coordinated Universal Time)
Montha Cyclone : మొంథా తుపాను కు ఈ పేరు ఎలా వచ్చిందంటే?
మొంథా తుపాను తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ పై చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

మొంథా తుపాను తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ పై చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. థాయ్ భాషలో మొంథా అంటే సువాసన గల పువ్వు అని అర్థం. పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన తుఫాన్ మొంథా వేగంగా దూసుకు వస్తుంది. ఉత్తర–ఉత్తర–పడమర దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీవ్ర తుఫాన్‌గా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఈ తుఫాన్ మచిలీపట్నానికి దక్షిణ–ఆగ్నేయ దిశగా 190 కి.మీ., కాకినాడకు దక్షిణ–ఆగ్నేయంగా 270 కి.మీ., విశాఖకు దక్షిణ–ఆగ్నేయంగా 340 కి.మీ. దూరంలో కేంద్రం చేసుకుని ఉందని తెలిపింది.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని బీచ్ లను అధికారులు మూసివేశారు.
సముద్ర స్నానాలు చేయకుండా...
కార్తీక మాసం కావడంతో స్నానాలు చేయడానికి భక్తులు బీచ్ లకు వస్తారని భావించి బీచ్ ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరూ బీచ్ ల వైపు వెళ్లవద్దని సూచిస్తున్నారు. కాకినాడ ప్రాంతంలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే గుడెసెలు, పురాతన ఇళ్లలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన సురక్షితమైన మంచినీటితో పాటు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనంతో పాటు చిన్నారులకు పాలను కూడా సిద్ధం చేశారు.
మొంథా అంటే...
ఈ తుఫాన్ అదే దిశగా కదులుతూ ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి మధ్యలో మచిలీపట్నం–కాలింగపట్నం మధ్య తీరాన్ని, కాకినాడ సమీపంలో, గంటకు 90–100 కి.మీ. వేగంతో గాలులు, గాలివానలతో కూడిన తీవ్ర తుఫాన్‌గా దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. మొంథా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. థాయ్ భాషలో మొంథా అంటే సువాసన గల పువ్వు అని అర్థం. అయితే మొంథా ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story

