Fri Dec 05 2025 12:23:29 GMT+0000 (Coordinated Universal Time)
Cyclone : దూసుకొస్తున్న మంతా తుపాను... ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు
మంతా తుపాను దూసుకు వస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

మంతా తుపాను దూసుకు వస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపానుకు మంతాగా నామకరణం చేశారు. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఏదో ఒకచోట తీరం దాటే అవకాశం ఉందని అంచనావ వేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కి రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఈ నెల 26, 27, 28, 29, తేదీల్లో చాలా కీలకమైన రోజులని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన వర్షాలు ఈ తుపాను ప్రభావంతో పడతాయని చెబుతున్నారు.
మూడు రోజులు కీలకం...
ఆంధ్రప్రదేశ్ కి ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేశారు. 28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయం లో ఆంధ్రప్రదేశ్ లో మంతా తుపాను తీరం దాటే అవకాశముందని చెబుతున్నారు. ఈ సంవత్సరం వచ్చే అన్ని తుఫానులలో బలమైన తుఫాన్ ఇదేనని అంటున్నారు. విశాఖపట్నం-తిరుపతి వరకు దీన్ని ప్రభావం ఉంటుందంటున్నారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన వర్షాలు, తెలంగాణ, హైదరాబాద్ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మధ్య కోస్తాఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని భాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మత్స్యకారులు చేపల వేటకు...
సముద్రతీర ప్రాంతాల్లో ల్లో ఉన్నట్లు వంటి మత్యకారులను అప్రమత్తం చేయాలని, ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దిగువున వున్నా లోతట్టు ప్రాంత లంక ప్రజలను అప్రమత్తం చేయాలని, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. బలమైన గాలులు వీస్తాయని గంటకు 70 నుంచి 100 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యాసంస్థలకు ఈ నెల 28,29 తేదీల్లో సెలవు ప్రకటించవలసిందిగా వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర ప్రయాణం చేసేవాళ్ళు ఈ మూడు రోజులలో ప్రయాణాలు ఆపుకోవాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Next Story

