Sun Mar 15 2026 23:02:36 GMT+0530 (India Standard Time)
ఏపీలో నైట్ కర్ఫ్యూ ... ఉత్తర్వులు జారీ
ఏపీలో రాత్రి వేళ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది

ఆంధ్రప్రదేశ్ లో రాత్రి వేళ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. యాభై శాతం ఆక్యుపెన్సీతో మాల్స్ ను, సినిమా ధియేటర్లను నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు, భౌతిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కోవిడ్ నిబంధనలను.....
దుకాణాల్లో ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరింది. ధర్డ్ వేవ్ ముంచుకొస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి జగన్ ఆంక్షలను కఠినతరం చేయాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story

