Mon Mar 16 2026 17:05:23 GMT+0530 (India Standard Time)
తిరుమలలో "అమ్మో" శనివారం
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువయింది

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నడకదారిన వచ్చిన భక్తులకు నాలుగు గంటల్లోగా దర్శనం అవుతుందని తెలిపారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం....
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 57,354 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,398 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
Next Story

