Fri Dec 05 2025 15:49:08 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో శివరాత్రికి రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శివరాత్రి కావడంతో భక్తులు రద్దీ తక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శివరాత్రి కావడంతో భక్తులు రద్దీ తక్కువగా ఉంది. నిన్నటి వరకూ భక్తులతో కిటకిటలాడిన తిరుమల వీధులు నేడు బోసి పోయి కనిపిస్తున్నాయి. శివరాత్రి నాడు శైవ క్షేత్రాలకు వెళ్లడం సంప్రదాయంగా వస్తుండటంతో భక్తుల రద్దీ తక్కువగా తిరుమలలో ఉంటుందని ముందుగానే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేశారు. ప్రతి శివరాత్రికి భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుందని, అయితే ముందుగా బుక్ చేసుకున్న వారు మాత్రమే తిరుమలకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
శివరాత్రి కావడంతో...
తిరుమలలో భక్తుల రద్దీ నిత్యం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన దినాల్లో మాత్రమే భక్తులు రద్దీ తక్కువగా ఉంటుంది. ఎస్.ఎస్.డి. టోకెన్లు రోజూ జారీ చేస్తుండటంతో భక్తులు ప్రతి రోజూ వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుమలలోని అన్న ప్రసాదం క్యాంటిన్ వద్ద కూడా రద్దీ తక్కువగానే ఉంది. తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద కూడా రష్ అంతగా లేదు. తిరిగి రేపటి నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, శుక్ర, శని, ఆదివారాలు మరింతగా భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. స్వామి వారిని నేరుగా దర్శనం చేసుకుంటున్నారు. ఉచిత దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల్లో దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతిదేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,127 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో19,307 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.29 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

