Fri Dec 05 2025 21:08:45 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శనివారం తిరుమలలో రద్దీ ఊహించని విధంగా?
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శనివారం కూడా భక్తుల రద్దీ తక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శనివారం కూడా భక్తుల రద్దీ తక్కువగా ఉంది. సహజంగా శనివారం భక్తుల రద్దీ ఎప్పుడూ అధికంగా ఉంటుంది. అయితే ఈ శనివారం మాత్రం రద్దీ తక్కువగా ఉండటంతో భక్తులు స్వామి వారి దర్శనాన్ని సులువుగా చేసుకుంటున్నారు. కంపార్ట్ మెంట్లలో పెద్దగా వేచి ఉండకుండానే ఏడుకొండల వాడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్నటి వరకూ భక్తుల రద్దీ అధికంగా ఉండి, ఒక్కసారి శనివారం భక్తుల రద్దీ తగ్గడంతో తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మాసంలో...
ఫిబ్రవరి మాసంలో సహజంగా ఎప్పుడూ భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు ఉండటంతో పాటు వేసవి సెలవుల్లో వెళదామని ముందుగా ప్లాన్ చేసుకోవడంతో పాటు రిజల్ట్ వచ్చిన తర్వాత తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫిబ్రవరి మాసంలో భక్తుల రద్దీ అంతగా ఉండదని ముందుగానే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేసుకున్నారు. కేవలం ముందుగా ప్రత్యేక దర్శనం టోకెన్లు బుక్ చేసుకున్న వారితో పాటు దక్షిణాది తీర్థయాత్రలకు వచ్చే వారు మాత్రమే తిరుమలకు చేరుకుంటున్నారు.
ఎనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 64,527 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,129 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

