Sun Mar 15 2026 15:45:27 GMT+0530 (India Standard Time)
Tirumala : ఆదివారం.. తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తులు రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు

తిరుమలలో భక్తులు రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వీకెండ్ లో ఎక్కువ మంది శ్రీవారిని దర్శించుకుంటారు. శని, ఆదివారాలు ఎక్కువ రద్దీగా ఉంటుంది. వసతి గృహాలు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో క్యూ లైన్లలో కూడా భక్తులు బారులు తీరారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
క్యూ లైన్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ఏడు గంటలకు ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారి ఆదాయం 3.51 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,158 మంది భక్తులు దర్శించుకున్నారు.
Next Story

