Fri Dec 05 2025 19:40:40 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో శుక్రవారం రద్దీ ఎలా ఉందో తెలిస్తే?
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ అంతగా లేదు.

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ అంతగా లేదు. సహజంగా శుక్రవారం నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి వారంలో శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ నేడు మాత్రం భక్తుల రద్దీ అంతగా లేదు. పరీక్షల సీజన్ ప్రారంభం కావడంతోనే భక్తుల రద్దీ అంతంత మాత్రంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. అలాగే వసతి గృహాల వద్ద కూడా పెద్దగా వెయిటింగ్ లేకుండానే లభిస్తుండటంతో భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హుండీ ఆదాయం మాత్రం...
తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం ఎప్పుడూ రద్దీ ఎక్కువగానే ఉంటుంది. కానీ మార్చి, ఏప్రిల్ నెలలో కొంత తగ్గుతుంది. పరీక్షల సీజన్ కావడంతో పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే హుండీ ఆదాయం మాత్రం భక్తుల సంఖ్య తగ్గినా ఏ మాత్రం తగ్గకుండా రావడం అధికారులను ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు హుండీ ఆదాయం పెద్దగా రాదని, అదీ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఆదాయం వస్తుందని చెబుతున్నారు.
ఎనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు ఉచిత దర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,627 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 15,468 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

