Tue Mar 17 2026 06:04:51 GMT+0530 (India Standard Time)
కొనసాగుతున్న రద్దీ.. కారణమిదే
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం కూడా భక్తుల రద్దీ తిరుమలలో కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం కూడా భక్తుల రద్దీ తిరుమలలో కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని తొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పటికిప్పుడు క్యూ లైన్ లో ప్రవేశించే వారికి అదనంగా సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,236 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,269 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.19 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

