Tue Mar 17 2026 13:46:44 GMT+0530 (India Standard Time)
తిరుమలలో తగ్గని రద్దీ.. ఇప్పుడు దర్శన సమయం?
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం కూడా స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారి తీరి ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం కూడా స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారి తీరి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లన్నీ భక్తులు నిండిపోయాయి. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట ఏటీసీ వరకూ క్యూ లైన్ ఉంది. స్వామి వారి దర్శనం కోసం 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఇప్పుడు ప్రవేశించే వారికి అదనంగా మర నాలుగైదు గంటల సమయం పట్టే అవకాశాలున్నాయి.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,468 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 36,082 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

