Fri Mar 20 2026 07:10:44 GMT+0530 (India Standard Time)
Tirumala Update : నేడు సులువుగానే స్వామి వారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల సంఖ్య పెద్దగా లేదు.

Tirumala Update :తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల సంఖ్య పెద్దగా లేదు. కంపార్ట్మెంట్లలో క్యూ లైన్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. శ్రీవారి దర్శనం కూడా వెనువెంటనే పూర్తవుతుంది. వసతి గృహాలు కూడా సులువుగానే దొరుకుతున్నాయి. బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. నిన్నటి వరకూ భక్తులతో కిటకిటలాడిన తిరుమల ఈరోజు కొంత రద్దీ తగ్గింది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
మూడు కంపార్ట్మెంట్లలోనే....
ఈరోజు తిరుమలలో కేవలం మూడు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 68,363 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,609 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.55 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story

