Fri Dec 05 2025 18:17:38 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : రద్దీ సాధారణమే... రీజన్ ఇదే
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల సంఖ్య తక్కువగానే కనపడుతుంది. క్యూ లైన్లలో భక్తులు పెద్దగా లేరు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల సంఖ్య తక్కువగానే కనపడుతుంది. క్యూ లైన్లలో భక్తులు పెద్దగా లేరు. బుధవారం కావడం, పెళ్లిళ్ల సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుండటంతో భక్తుల సంఖ్య తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ లో మాత్రం మళ్లీ రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు. కార్తీక మాసం కావడం, ఉపవాసాలు ఉండి ఇంటి దగ్గరే ప్రార్థనలు చేయడం కూడా భక్తుల రద్దీ తగ్గడానికి కారణంగా చెబుతున్నారు.
ఇరవై గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పదమూడు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఇరవై గంటల సమయం పడుతుంది. అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,891 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.55 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

