Tue Mar 17 2026 04:12:59 GMT+0530 (India Standard Time)
తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్మెంట్లలోనే భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం దర్శనానికి పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,242 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,862 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.08 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

