Mon Mar 16 2026 17:06:45 GMT+0530 (India Standard Time)
తిరుమలలో తగ్గిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం కావడంతో పెద్దగా భక్తుల రద్దీ తిరుమలలో కనిపించడం లేదు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం కావడంతో పెద్దగా భక్తుల రద్దీ తిరుమలలో కనిపించడం లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒక కంపార్ట్మెంట్లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి దర్శన సమయం మూడు గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం క్యూ లైన్లో ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయంలో పూర్తవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,870 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 27,480 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.88 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
- Tags
- rush
Next Story

