Fri Dec 05 2025 22:32:41 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు ఈ నెలలోనే వస్తే సులువుగా దర్శనం... ఎందుకంటే?
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు.

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. అయితే శుక్రవారం నుంచి తిరిగి భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి. తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటే కష్టాలు తొలిగిపోతాయని అందరూ భావిస్తారు. అదే సమయంలో తిరుమలకు ఏడాదికి ఒక సారి రావడం వెంకన్న భక్తులు తమ సంప్రదాయంగా మార్చుకున్నారు. అయితే పరీక్షలు ప్రారంభం అవ్వడంతో ఈ నెలలోనే తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
మార్చి నెలలో...
తిరుమలకు వచ్చే వారు ఈ నెలలో వస్తేనే మంచిదని అందరూ సూచిస్తున్నారు. పరీక్షలు జరుగుతున్నందున ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం లేకపోవడంతో స్వామి వారి దర్శనం సులువుగా దక్కే అవకాశముంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అందుకే శుక్రవారం నుంచి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంటుందని భావిస్తున్నారు. ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న వారితో పాటు ఎస్.ఎస్.డి. టోకెన్లు రోజువారీ ఇస్తుండటంతో భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడం సులువుగా మారిందంటున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 64,861 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,639 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.65 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు.
Next Story

