Fri Dec 05 2025 17:33:04 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ అంతంత మాత్రమే
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. రేపటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో రేపటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు పెద్దగా కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండానే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. వసతి గృహాలు కూడా సులువుగానే దొరుకుతున్నాయి. అదే సమయంలో లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా భక్తుల రద్దీ లేదు. ఘాట్ రోడ్ లోనూ వాహనాల సంఖ్య తక్కువగానే ఉంది.
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు..
రేపటి నుంచి తిరుమల శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారి వాహన సేవలను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈరోజు రాత్రికి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఒక్క గరుడ వాహనం రోజు మినహాయించి మిగిలిన అన్ని రోజుల్లో సర్వదర్శన టోకెన్లు ఇరవై ఐదు వేలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఐదు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,681 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,510 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

