Fri Dec 05 2025 14:59:33 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ రీజన్ ఇదేనట
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు

తిరుమల భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. గత కొన్ని రోజులు నుంచి భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. ఇండియా - పాక్ సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలు కొంత తిరుమల పర్యటనపై ప్రభావం చూపాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు కొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకోనున్నారు. వేసవి కాలంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి సామాన్యుల భక్తులకు సత్వరం దర్శనం, వసతి కలిగేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రేపటి నుంచి సిఫార్సు లేఖలు...
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సిఫార్సు లేఖలను కూడా ఇకపై తీసుకోవాలని నిర్ణయించారు. ఈనెల 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలను అనుమతించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయించారు. వేసవిలో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి మే 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకూ ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని గతంలో టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే భక్తుల రద్దీ అంతగా లేకపోవడంతో నిర్ణయాన్ని పునస్సమీక్షించి రేపటి నుంచి సిఫార్సు లేఖలను అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది.
మూడు గంటల్లోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని తొమ్మిది కంపార్ట్ మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,477 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,294 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.84 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

