Fri Dec 05 2025 14:59:42 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు ఎలా ఉందంటే? దర్శన సమయం చూస్తే?
తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. గురువారం కావడంతో భక్తుల రద్దీ కొంత మేర తగ్గింది

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. గురువారం కావడంతో భక్తుల రద్దీ కొంత మేర తగ్గింది. నిన్నటి వరకూ అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించేది. స్వామి వారిని దర్శించుకునేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. దాదాపు రెండున్నర నెలల నుంచి స్వామి వారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టేది. అయితే నేడు అంత రద్దీ లేకపోయినా భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
రేపటి నుంచి మళ్లీ...
జులై నెల చివరికి వచ్చే సరికి కొంత రద్దీ తగ్గింది. మే 15వ తేదీ నుంచి ప్రారంభమయిన భక్తుల రద్దీ నిన్నటి వరకూ కొనసాగింది. అయితే రేపు శుక్రవారం కావడంతో పాటు శ్రావణమాసం కూడా వస్తుండటంతో ఇక మూడు రోజుల పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ నెలలో తరహాలోనే జులై నెలలోనూ హుండీ ఆదాయం అత్యధికంగా వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. శ్రీవారి సేవకులు భక్తుల సేవలో నిరంతరం పనిచేస్తుండటంతో వారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది నుంచి పన్నెండు గంటల సమయం పడుుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,130 మంది భక్తులు దర్శించుకున్నారు.వీరిలో 26,786 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.55 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

