Tue Mar 17 2026 11:57:19 GMT+0530 (India Standard Time)
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒక కంపార్ట్మెంట్ లోనే భక్తులు వేచి చూస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒక కంపార్ట్మెంట్ లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ భక్తులకు 18 గంటల దర్శనానికి సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పుడు సర్వదర్శనం క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకు అదనంగా మరో మూడు నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు.
హుండీ ఆదాయం
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల వరకూ దర్శన సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,214 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,147 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.50 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

