Thu Mar 23 2023 23:03:06 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో రష్ నిల్.. దర్శనసమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. సోమవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. సోమవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్మెంట్లలోనేే భక్తులు శ్రీవారి దర్శనం కోసం భక్తుల కోసం వేచి చూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు గంటల్లో దర్శనం అవుతుంది.
హుండీ ఆదాయం....
నిన్న తిరుమల శ్రీవారిని 71,158 భక్తులు దర్శించుకున్నారు. 27,968 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం3.73 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
Next Story