Mon Mar 16 2026 20:05:29 GMT+0530 (India Standard Time)
దర్శనానికి 30 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ అధిక సంఖ్యలో ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ అధిక సంఖ్యలో ఉంది. ఈ మూడు నెలలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంటుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ముప్ఫయి కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో ఉన్న భక్తులకు కూడా శ్రీవారి దర్శనం ఐదు గంటలకు పైగానే పడుతుందని అధికారులు తెలిపారు.
శీఘ్రదర్శనం...
ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం క్యూలైన్లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ముప్ఫయి గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మూడు వందల రూపాయలు శీఘ్రదర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం శ్రీవారి దర్శనం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,101 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 30,991 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రజా ప్రతినిధులు ఎవరూ సిఫార్సు లేఖలు ఇవ్వవద్దంటూ టీడీపీ పేర్కొంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో టీటీడీకి సహకరించాలని కోరింది.
Next Story

