Tue Mar 17 2026 06:02:28 GMT+0530 (India Standard Time)
శ్రీవారి దర్శనానికి 30 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. పండగ సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువయింది

తిరుమలలో భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. పండగ సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించి ఉంది. సర్వదర్శనం భక్తులు స్వామి వారి దర్శనం చేసుకోవడానికి ముప్ఫయి గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పుడు సర్వదర్శనం క్యూ లైన్ లో ప్రవేశించే వారికి అదనంగా మరో నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,394 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 27,492 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.22 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

