Sun Mar 15 2026 14:06:10 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ మామూలుగా లేదుగా
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. క్యూ లైన్ లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
క్యూలైన్ బయట వరకూ...
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ బయట వరకూ విస్తరించి ఉంది. సర్వదర్శనానికి భక్తులకు పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడువందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి నాలుగు గంటల సమయం పడుతుంది.
Next Story

