Fri Dec 05 2025 20:13:38 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. ఈరోజు దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత నాలుగు రోజుల నుంచి భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. తిరుమలకు ఈ నాలుగు రోజుల్లో వచ్చిన భక్తులకు సులువుగా దర్శనం అవుతుంది. కంపార్ట్ మెంట్లు కూడా పెద్దగా నిండలేదు. భక్తులు స్వామి వారిని నేరుగా దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. గత రెండు నెలల నుంచి తిరుమలకు పోటెత్తిన భక్తులు సోమవారం నుంచి కొంత తగ్గడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వేసవి రద్దీ ముగిసిందని భావించారు.
ఆదివారం వరకూ...
అయితే జూన్ నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. 120 కోట్ల రూపాయల వరకూ రావడంతో పాటు వేసవి రద్దీని తట్టుకుని భక్తులకు అన్ని సౌకర్యాలతో పాటు వారు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇక ఆషాఢమాసం కావడంతో భక్తుల రద్దీ కొంత తగ్గిందని భావించినా నేటి నుంచి మళ్లీ రద్దీ మొదలయింది. ఈ రద్దీ ఆదివారం వరకూ కొనసాగే అవకాశముందని అంచనా వేసిన టీటీడీ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదకొండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో కిఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,510 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,050 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

