Fri Dec 05 2025 14:59:44 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : గుడ్ న్యూస్.. తిరుమలకు వెళుతున్నారా... అయితే ఇది మీకోసమే
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఈరోజు నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలుంది. ఆదివారమయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఈరోజు నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలుంది. ఆదివారమయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు. శ్రావణ మాసం ముగియడం, భాద్రపద మాసం రావడంతో రద్దీ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఆదివారం తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఈరోజు రద్దీ లేకపోవడంతో భక్తులు సులువుగా స్వామి వారిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మళ్లీ వరస సెలవులు వస్తే రద్దీ పెరుగుతుందని చెబుతున్నారు.
మూడున్నర నెలల నుంచి...
గత మూడున్నర నెలల నుంచి భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా వస్తుంది. హుండీ ఆదాయం శ్రీవారికి గణనీయంగా చేరింది. అలాగే లడ్డూ విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. క్యూ లైన్ లు బయట వరకూ విస్తరించడం, కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోవడంతో నిన్నటి వరకూ తిరుమల భక్త జన సంద్రంతో కిటకిట లాడింది. కానీ ఒక్కసారిగా తిరుమలకు భక్తుల రద్దీ తగ్గడం సాధారణమేనని, తిరిగి శుక్రవారం నుంచి భక్తుల రద్దీ ప్రారంభమయ్యే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
కంపార్ట్ మెంట్లన్నీ...
ఈరో్జు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. స్వామి వారిని నేరుగా దర్శించుకునేందుకు వీలుగా భక్తుల రద్దీ ఏర్పడింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 83,858 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,034 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

