Sat Mar 07 2026 11:31:01 GMT+0530 (India Standard Time)
Tirumala : క్యూ లైన్లు దాటి... బయట వరకూ బారులు తీరిన భక్తులు
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది. రథసప్తమి కావడంతో ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగింది

తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది. రథసప్తమి కావడంతో ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగింది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో బయటే వేచి ఉన్నారు. స్వామి వారి దర్శన సమయం కూడా ఎక్కువ సమయం పడుతుంది. రథసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరడంతో ఒక్కసారి రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
స్వామి వారి దర్శనానికి...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి బయట వరకూ లైన్లు విస్తరించాయి. బయట ఏటీజీ గెస్ట్‌హౌస్ వరకూ భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 45,825 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,380 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story

