Fri Dec 05 2025 13:18:25 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల భక్తుల రద్దీ మామూలుగా లేదుగా.. ఇంత పొడవు లైనా?
Tirumala : తిరుమల భక్తుల రద్దీ మామూలుగా లేదుగా.. ఇంత పొడవు లైనా?

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు క్యూ లైన్ చాలా పొడగు వరకూ విస్తరించింది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల బారులు తీరారు. గంటల కొద్దీ సమయం పడుతుంది. వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చి ఏడుకొండల వాడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తెలిపారు.
ఆగస్టు నెల టోకెన్లు...
నేడు ఆన్ లైన్ లో ఆగష్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు. ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్నారు. రేపు ఉదయం పది గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. బయట శిలాతోరణం వరకూ భక్తులు క్యూ లైన్ లో నిల్చుని శ్రీవారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,579 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,067 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.74 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

