Wed Jul 16 2025 23:11:32 GMT+0000 (Coordinated Universal Time)
Sajjala : సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు
వైసీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది.

వైసీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది. కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయి కేసు నమోదు చేయాలని ఆదేవించింది. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారంటూ టీడీపీ నేతలు దేవినేని ఉమ, గూడపాటి లక్ష్మీనారాయణ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏజెంట్ల సమావేశంలో...
దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి పై 153, 505, 125 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రూల్ ప్రకారం కాకుండా ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లకు అడ్డంపడే విధంగా వ్యవహరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ పై ఈ కేసు నమోదయింది. రూల్ ప్రకారం పోవడానికి ప్రయత్నించవద్దని కూడా ఆయన అన్నారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
Next Story