Wed Dec 17 2025 12:54:42 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై కేసు నమోదు..25న కోర్టుకు హాజరు కావాలని ఆదేశం
జనసేన నేత పవన్ కల్యాణ్ క్రిమినల్ కేసు నమోదయింది. 2023 జులై 9న వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేసింది

జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్రిమినల్ కేసు నమోదయింది. గత ఏడాది జులై 9న వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని పవన్ కల్యాణ్ కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరు కోర్టులో ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసింది.
ఈ సెక్షన్ల కింద....
దీంతో 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ నెల 25న పవన్ కల్యాణ్ న్యాయస్థానానికి హాజరవుతారా? లేదా పై కోర్టుకు వెళతారా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై పవన్ కల్యాణ్ న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది.
Next Story

