Sun Mar 15 2026 23:14:03 GMT+0530 (India Standard Time)
దేవినేనిపై కేసు నమోదు
మాజీ మంత్రి దేవినేని ఉమపై క్రిమినల్ కేసు నమోదయింది.

మాజీ మంత్రి దేవినేని ఉమపై క్రిమినల్ కేసు నమోదయింది. ముఖ్యమంత్రి జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతోపాటు అసభ్యంగా దూషించారంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కేసులో ఫిర్యాదు అందడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. దీంతో ఆయనను ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశముందని తెలియడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది.
దిష్టిబొమ్మ దహనం కేసులో...
జగనాసుర చరిత్ర పేరుతో దిష్టిబొమ్మను తెలుగుదేశం పార్టీ నేతలు దగ్ధం చేశారు. కొండపల్లిలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారని ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమపై ఐపీసీ 149, 153ఏ, 505(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story

