Andhra Pradesh : సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. భూ కేటాయింపులివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. రాజధాని అమరావతిలో మరో ఇరవై వేల ఎకరాలను అదనంగా సమీకరించాలని నిర్ణయించింది. సీఆర్డీఏ సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఏడు గ్రామాల్లో భూసమీకరణకు సంబంధించి రైతులు అంగీకరించారని, మిగిలిన గ్రామాల్లో దశల వారీగా భూములను సమీకరిస్తామని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణం ఖచ్చితంగా మూడేళ్లలో పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ గతంలో 2018 మాస్టర్ ప్లాన్,డిజైన్ లకు ఆలస్యం కావడం తో నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. ఈసారి అమరావతి విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని తెలిపారు. భూసమీకరణ అంశంలో వైసీపీ నాయకులు కొన్ని గ్రామాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, జగన్ మళ్లీ వస్తాడని అనుమానం ఏ మాత్రం అవసరం లేదని, రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4 , తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలోని ఫైనాన్స్, స్పోర్ట్ సిటీల్లో దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ , మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ ఎఫ్ పీ పిలిచేందుకు ఆమోదం తెలిపిందని చెప్పారు.