Thu Mar 19 2026 04:43:08 GMT+0530 (India Standard Time)
CPM : ఏపీలో బృందాకరత్ నేటి నుంచి పర్యటన
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఎన్నికల ప్రచారం నిర్వహించ నున్నారు. ఆదివారం సాయంత్రం 4.30గంటలకు శ్రీకాకుళం నుంచి పాలకొండ చేరుకోనున్న బృందాకరత్ ఆర్టిసి కాంప్లెక్సు అవుట్గేటు పక్క ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో పాల్గొంటారు.
అభ్యర్థులకు మద్దతుగా...
రాత్రికి పార్వతీపురం చేరుకొని బస చేస్తారు. సోమవారం ఉదయం 11గంటలకు గుమ్మలక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం పార్వతీపురం చేరుకొని పట్టణంలో రోడ్డుషో, ప్రచార సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి రాత్రికి విజయనగరం చేరుకుంటారు. 7వ తేదీని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు.
Next Story

