Thu Apr 09 2026 14:54:54 GMT+0530 (India Standard Time)
జగన్ రాజకీయ పరిజ్ఞానం లేదు : బీవీ రాఘవులు
సీపీఎం నేత బీవీ రాఘవులు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు

సీపీఎం నేత బీవీ రాఘవులు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. జగన్కు రాజకీయ మెచ్యూరిటీ లేదని బీవీ రాఘవులు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులని జగన్ అన్నారని, ఇప్పుడు మావిగన్ అంటున్నారని బీవీ రాఘవులు మండి పడ్డారరు.
పన్నెండేళ్లయినా...
రాజధానిపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదన్న బీవీ రాఘవులు ఇప్పుడైనా అమరావతికి జగన్ సహకరించాలని కోరారు. పన్నెండేళ్లు రాష్ట్రానికి రాజధాని లేకపోవడం పట్ల చంద్రబాబు, జగన్ లు సిగ్గుపడాలని బీవీ రాఘవులు అన్నారు. రాష్ట్రానికి రాజధాని అంటూ లేకపోవడానికి వీరిద్దరే కారణమని బీవీ రాఘవులు మండి పడ్డారు.
Next Story

