Sat Jan 18 2025 03:33:33 GMT+0000 (Coordinated Universal Time)
ఏందీ ఈ దమనకాండ?
వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు.
వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. ఉద్యోగులను నిర్భంధించే బదులు వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చలో విజయవాడకు పిలుపునిచ్చి ఉద్యోగులు తమ నిరసనలు తెలియజేయాలనుకున్నా నిర్భంధాన్ని పోలీసులు కొనసాగిస్తున్నారన్నారు. అక్రమ అరెస్ట్ లు, గృహనిర్భంధాలతో ప్రభుత్వం సమస్యల నుంచి తప్పించుకోగలదా? అని రామకృష్ణ ప్రశ్నించారు.
కమిటీ నివేదికను...
ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసుల దమనకాండను సీపీఐ ఖండిస్తుందని రామకృష్ణ తెలిపారు. అశుతోష్ కమిటీ నివేదికను బయట పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ఆయన నిలదీశారు. పీఆర్సీ జీవోలను రద్దు చేసి వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
- Tags
- ramakrishna
- cpi
Next Story