Fri Dec 05 2025 16:43:33 GMT+0000 (Coordinated Universal Time)
రెచ్చగొట్టొద్దు.. ధ్వంసం చేసింది మీరే
విశాఖను ధ్వంసం చేస్తుంది వైసీపీ మంత్రులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు

విశాఖను ధ్వంసం చేస్తుంది వైసీపీ మంత్రులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విశాఖపట్నం కూడా ఒక్క రాత్రిలో అభివృద్ధి చెందలేదని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పోర్టు, స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతనే విశాఖ క్రమంగా అభివృద్ధి జరిగిందన్నారు. అలాంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని రామకృష్ణ ప్రశ్నించారు.
ముగిసిందని అనుకుంటే....
మంత్రులు రైతుల పాదయాత్రపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమేంటని రామకృష్ణ నిలదీశారు. ప్రజల మధ్య విధ్వేషాలను పెంచే ప్రయత్నం చేయవద్దని రామకృష్ణ హితవు పలికారు. హైకోర్టుకు తాము బిల్లులను ఉపసంహరించుకుంటున్నామని చెబితే రాజధాని అమరావతి అంశం ముగిసిందని అనుకున్నామని, ఇప్పుడు మరోసారి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల మధ్య విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Next Story

