Fri Dec 05 2025 17:37:27 GMT+0000 (Coordinated Universal Time)
దానిపై పవన్ క్లారిటీ ఇచ్చిన తర్వాతే?
భారతీయ జనతా పార్టీ విషయంలో పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వాలని సీీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

భారతీయ జనతా పార్టీ విషయంలో పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వాలని సీీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆ క్లారిటీ ఇస్తే తాము తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలసి నడిచేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి రాజకీయ పార్టీ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ బీజేపీ విషయంలో తమకు అభ్యంతరాలున్నాయని రామకృష్ణ తెలిపారు.
కలసి పనిచేసేందుకు...
బీజేపీ అన్ని రకాలుగా వైసీపీకి వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. అందుకే ఆ పార్టీని నమ్మలేమని చెప్పారు. బీజేపీ విషయంలో పవన్ కల్యాణ్ క్లారిటీ ఇస్తే తాము కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో అందరూ కలసి ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Next Story

