Sat Mar 07 2026 15:36:53 GMT+0530 (India Standard Time)
రోడ్ షోలపై నిషేధం ; రామకృష్ణ అభ్యంతరం
రాష్ట్రంలో రోడ్ షోలపై నిషేధం విధించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు

రాష్ట్రంలో రోడ్ షోలపై నిషేధం విధించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ నిరంకుశ నిర్ణయం తీసుకుందని ఆయన మండి పడ్డారు. ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకే ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యం ఖూనీ...
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని ఆయన ఆవేదన చెందారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే కార్యక్రమంలో భాగంగా ఈ చీకటి జీవోను తెచ్చిందని రామకృష్ణ ఆరోపించారు. ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతులు తీసుకోవచ్చంటే.. అది వైసీపీ నేతలకు ఒక్కరికే మినహాయింపా అని ఆయన ఎద్దేవా చేశారు. ఏదో కొన్ని సంఘటనలు జరిగాయని నిషేధం విధించడమేంటని ఆయన ప్రశ్నించారు. వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని రామకృష్ణ కోరారు.
- Tags
- ramakrishna
- cpi
Next Story

