Sat Mar 07 2026 15:38:32 GMT+0530 (India Standard Time)
జగన్ పెదవి విప్పాల్సిందే
పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు

పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్మాణం విషయంలో నాన్పుడు ధోరణిని ప్రదర్శిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మంత్రుల విరుద్ధ ప్రకటనతో పోలవరం నిర్మాణం జరుగుతుందా? లేదాా? అన్న సందేహం కలుగుతుందని రామకృష్ణ అన్నారు. పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం జగన్ కు ఉందని ఆయన అన్నారు.
ఏం మాట్లాడారు.....
అలాగే ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఏ ఏ అంశాలపై చర్చించారో ప్రజలకు వివరించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, పునరావసం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలదీయడంలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
Next Story

