Wed Mar 18 2026 21:14:04 GMT+0530 (India Standard Time)
CPI : ఏపీలో ఎవరిది అధికారమో చెప్పేసిన నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ఎవరు అధికారంలోకి వచ్చినా మోదీ నేతృత్వంలోనే ఏపీలో ప్రభుత్వం పనిచేస్తుందన్న నారాయణ దేశంలో ఇండియా కూటమికి సానుకూల పవనాలు వీస్తున్నాయని తెలిపారు.
బాధ్యత లేకుండా...
ఆంధ్రప్రదేశ్ లో ఘర్షణలు జరుగుతుంటే ఇద్దరు ప్రధాన పార్టీల నేతలు బాధ్యత లేకుండా వ్యవహరించారన్నారు. ఇక్కడ అల్లర్లు జరుగుతుంటే వాటిని నివారించాల్సిన అధినేతలు విదేశాలకు వెళ్లి జల్సాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ విదేశాాలకు వెళ్లి ఇక్కడ పరిస్థితులను గాలికి వదిలేశారన్నారు. ఇది క్షమించరాని నేరమన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల అధినేతలపై ఉందన్నారు.
Next Story

